Search
Close this search box.

  రామ్ చరణ్ కథతో చిరంజీవి సినిమా..! గురూజీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

November 17, 2026 11:24 PM | Aditya369 News

రామ్ చరణ్ కథతో చిరంజీవి సినిమా..! గురూజీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘కాకా’ చిత్రంలో నటిస్తున్న చిరు, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎప్పటి నుంచో విడుదల కోసం ఎదురుచూస్తున్న ‘విశ్వంభర’ కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది. అయితే ఈ సినిమాల తర్వాత మెగాస్టార్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మొదట శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయాల్సి ఉండగా, కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్‌లో పడినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చిరంజీవి సినిమా చేయబోతున్నారనే వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇప్పటికే త్రివిక్రమ్ చెప్పిన కథను చిరంజీవి విని ఇంప్రెస్ అయినట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు త్రివిక్రమ్ వినిపించిన కథనే ఇప్పుడు చిరంజీవికి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే చరణ్ కోసం సిద్ధం చేసిన కథలో కొన్ని మార్పులు చేసి మెగాస్టార్‌కు సరిపోయేలా రూపొందించారట.

ఇది పూర్తిస్థాయి ఎమోషనల్ డ్రామాగా ఉండబోతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ ప్రకటించిన ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉండటంతో, ఈలోపు చిరంజీవితో ఓ సినిమా చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే మెగాస్టార్, మాటల మాంత్రికుడు కలిసి సినిమా చేయబోతున్నారా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు