Search
Close this search box.

  అనిల్ రావిపూడి,ఎన్టీఆర్ సినిమాలో క్రేజీ హీరోయిన్..? సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

November 17, 2026 11:16 PM | Aditya369 News

అనిల్ రావిపూడి,ఎన్టీఆర్ సినిమాలో క్రేజీ హీరోయిన్..? సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉండగా, ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చేయనున్నారు. ఈ క్రమంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఎన్టీఆర్ లైనప్‌లో చేరడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌ను ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు. అంతేకాదు, తమ కాంబినేషన్‌లో నవ్వుల విందు సిద్ధమవుతోందని ఎన్టీఆర్ చెప్పడంతో ఈ సినిమా పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే అంచనాలు మొదలయ్యాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ‘దానవీరశూర’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా నటించబోయే హీరోయిన్ విషయంలో కూడా ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా కోసం నటి భాగ్యశ్రీని అనిల్ రావిపూడి సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా భాగ్యశ్రీ ఇన్‌స్టాగ్రామ్ బయోలో టైగర్ ఎమోజీ ఉండటం, ఆమె ఎన్టీఆర్‌ను ఫాలో అవుతుండటంతో అభిమానుల్లో అనుమానాలు మరింత పెరిగాయి.

దీంతో ఎన్టీఆర్, అనిల్ రావిపూడి సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించబోతున్నారంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ సంకేతాలే నిజమని చెప్పలేం. ఆమె ఈ సినిమాలో నటిస్తున్న విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరి నిజంగానే భాగ్యశ్రీ ఎన్టీఆర్ సరసన నటించబోతున్నారా? ‘దానవీరశూర’ టైటిల్ ఖరారైందా? ఈ ఆసక్తికరమైన విషయాలపై చిత్ర బృందం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు