జనసేన పార్టీ సభ్యత్వం తొలుత పిఠాపురం నుండే ఎక్కువగా మొదలు పెట్టాలని పవన్ సూచించారు. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలుత పిఠాపురం నుండి ప్రారంభమై, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చేస్తామన్నారు. ఈసారి నమోదు సంఖ్య రెట్టింపు అవుతుందన్న నమ్మకం ఉందన్నారు.








