మహాశివరాత్రి పర్వదినాలలో శైవక్షేత్రాలకు వెళ్లే విఐపీలకు, ప్రోటోకాల్ దర్శనాలకు ప్రత్యేక సమయాలు కేటాయించడం జరిగిందని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. సామా న్యులకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. విఐపీలకు మధ్యాహ్నాం 1 గంట నుండి మధ్యాహ్నాం 3 గంటల వరకూ దర్శనాలకు సమయం కేటాయించడం జరిగిందన్నారు. లింగోద్భవ పూజా సమయంలో అంతరాలయంలో దర్శనాలు రద్దు పరచడం జరిగిందన్నారు.








