కాకినాడ జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలలో మహా శివరాత్రి సందర్భంగా సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యతను కల్పించి, భక్తులకు పెద్దపీట వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి స్పష్టం చేశారు. కాకినాడ కలెక్టరేట్ లో ఈ నెల 15న మహా శివారాత్రి సందర్భంగా పిఠాపురం, సామర్లకోటలో శైవ క్షేత్రాలతోపాటు మిగిలిన చోట్ల మహాశివరాత్రి ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో కలసి మీడియాకు వివరాలు వెల్లడించారు . ఆలయాల వద్ద పారిశుద్ధ్యంనిర్వాహణ, తాగునీటి సరఫరా, భక్తులు దర్శన మార్గాలపై ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.








