కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం కూటమి ప్రభుత్వంపై లేఖాస్త్రాన్ని సంధించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, విడుదల రజిని, జోగి రమేష్ తదితరులను వేధిస్తున్న వైనంపై విరుచు కుపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టిస్తే బాగుంటుందని, ప్రతిపక్ష నాయకుల్ని ముఖ్యమంత్రి పదవి కాలం పూర్తయ్యే వరకు జైలుకు పంపే అవకాశం ఉంటుందని ఎద్దేవా చేశారు. కాపులను టార్గెట్ గా, చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.










