రాత్రి పార్క్ చేసిన కారు చక్రాలు మాయమైన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. పిఠాపురంలోని సీతయ్యగారి తోటలో గండేపల్లి రాంప్రసాద్ తన హుండై వెన్యూ కారును ఇంటి ముందు రాత్రి పార్క్ చేశాడు. తెల్లారేసరికి కారు నాలుగు చక్రాలకు రెండు చక్రాలు దొంగిలించారు. దొంగలు చాకచక్యంగా జాకీ సహాయంతో చక్రాలు విప్పి పట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.









