సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా, బ్లాక్ బస్టర్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘కింగ్డమ్’. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ఫుల్ కాన్సెప్ట్‌తో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమా టీజర్‌కి, పాటలకు మంచి స్పందన రాగా, ఇప్పుడు ట్రైలర్‌పై ఫోకస్ పెరిగింది..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ‘కింగ్డమ్’ ట్రైలర్‌ను జూలై 25న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఈ రోజున మాస్ ట్రీట్ ఖాయంగా కనిపిస్తోంది..ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. విభిన్నమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాకి ఎమోషనల్ డెప్త్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందట.ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ట్రైలర్ రిలీజ్‌తో ఆ హైప్ మరింత పెరిగేలా కనిపిస్తోంది..









