Search
Close this search box.

  కూలీ ట్రైలర్ డేట్ లాక్..! ఎప్పుడంటే..?

‘మా నగరం’తో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన లోకేష్ కనగరాజ్, ‘ఖైదీ’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం విజయ్‌తో కలిసి చేసిన ‘లియో’ ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయినప్పటికీ, ఇప్పుడు ఆయన దృష్టంతా రజనీకాంత్‌తో చేస్తున్న ‘కూలీ’ సినిమా మీద ఉంది.

ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ఇందులో రజనీకాంత్, శృతిహాసన్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి లోకేష్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

లోకేష్ మాట్లాడుతూ –

“కూలీ ఒక కమర్షియల్ సినిమా అయినా కూడా ఎమోషన్ డిప్ గా ఉంటుంది. రజనీకాంత్ యాక్షన్ చూడగానే ప్రేక్షకులు షాక్ అవుతారు. ప్రమోషన్ కోసం ఎక్కువ లుక్స్ రివీల్ చేయదలుచుకోలేదు. ట్రైలర్‌తోనే సరిపోతుంది.
ఆ ట్రైలర్‌ను ఆగస్టు 2న విడుదల చేయనున్నాం.”

అలాగే నటీనటుల లుక్స్ గురించి తాను అంతవరకూ సీక్రెట్ ఉంచాలనుకుంటున్నట్టు తెలిపారు.

“నాగార్జున పాత్ర అతని కెరీర్‌లో మైలురాయి” – లోకేష్ నాగార్జున ‘కూలీ’లో ఒక వినూత్నమైన పాత్రలో కనిపించనున్నారు.

“ఆయనను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. కానీ ఇందులో ఆయన చేస్తున్న పాత్ర, ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో చేయని రకం. ఇది ఖచ్చితంగా నాగార్జున కెరీర్‌కు మైలురాయిగా నిలుస్తుంది” అని లోకేష్ చెప్పారు.

ఫహద్ ప్లేస్‌లో సౌబిన్ – ఖైదీ 2, విక్రమ్ 2 కూడా లైన్‌లోఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం మొదట ఫహద్ ఫాజిల్ను అనుకున్నప్పటికీ, షెడ్యూల్ సమస్యల వల్ల సౌబిన్ షాహిర్ను తీసుకున్నట్లు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు