పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రెండు మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్స్ – ‘ఓజీ’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల వరుసగా షూటింగ్ సెట్స్‌లో పాల్గొంటున్న పవన్, తన పొలిటికల్ డ్యూటీస్‌కి పాటు సినిమా పనులను కూడా సమపాళ్లలో నిర్వహిస్తున్నారు.
గతంలో ఆయన రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అనేక సందేహాలు తెరపైకి వచ్చాయి. సినిమాలో వర్క్ జరుగుతుందా? ఆగిపోయిందా? అనే రూమర్లు ఊపందుకున్నాయి. అయితే, తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చిన అప్డేట్‌తో ఈ ఊహాగానాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ సినిమా తీవ్రంగా షూటింగ్ దశలో ఉంది.రీ ఎంటర్ అయ్యాడు రమణ గోగుల..
ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్‌కి ఎంతో సెంటిమెంట్ అయిన సింగర్-మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల, ఈ సినిమాకి పాట పాడనున్నారని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘తమ్ముడు’లో “వయ్యారి భామ నీ హంస నడక” పాట ఎంతటి సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. పవన్ స్టైల్, మాస్ ఎనర్జీకి రమణ గోగుల వాయిస్ కలిస్తే అది ఏ రేంజ్‌లో ఫైర్ అవుతుందో అభిమానులకు బాగా తెలుసు.ఇప్పటికే ‘ఓజీ’ సినిమాలో రమణ గోగుల ఓ పాట పాడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం కూడా ఆయన మళ్లీ మైక్ పట్టుకున్నట్టు టాక్. గతంలో ఈ విషయాన్ని హరీష్ శంకర్ ఓ ఈవెంట్‌లో సూచించినట్టు తెలిసింది. ఇప్పుడు ఈ వార్తలకు మద్దతుగా ఇండస్ట్రీలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.ఈ అప్‌డేట్‌తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. పవన్ – రమణ గోగుల కాంబినేషన్ మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా? అనే ఆసక్తి ఫ్యాన్స్‌లో పెరిగిపోతోంది..









