‘దసరా’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న న్యాచురల్ స్టార్ నాని, ఇప్పుడు మరో మాస్ & ఇంటెన్స్ ప్రాజెక్ట్‌కి రెడీ అవుతున్నారు. ఈ కొత్త సినిమా పేరే – ‘ది ప్యారడైజ్’..‘దసరా’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ వ్యవహరిస్తుండటంతో, ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.ఇది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతుండగా, ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే, ఇప్పటి వరకూ చిత్ర నటీనటుల వివరాలపై స్పష్టత రాలేదు..కానీ తాజా సమాచారం మేరకు, ఈ సినిమాలో ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ భాగం కాబోతున్నట్టు తెలుస్తోంది.మోహన్ బాబు ఈ చిత్రంలో కీలకమైన విలన్ పాత్రలో కనిపించనున్నారని టాక్ ఇది అధికారికంగా వెల్లడించనప్పటికీ, శ్రీకాంత్ ఓదెల ఇటీవల మోహన్ బాబుతో చర్చలు జరిపినట్టు మంచు విష్ణు వెల్లడించడం ఆసక్తికరం..మోహన్ బాబు ఇప్పటికే చాలా సినిమాల్లో విలన్ గా నటించిన సగంతి సంగతి తెలిసింది..మరోవైపు, సినీ రంగంలో మళ్లీ యాక్టివ్‌గా మారుతున్న బాబు మోహన్ కూడా ఈ సినిమాలో ఓ పాత్ర చేస్తున్నట్టు స్వయంగా ధృవీకరించారు…









