ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ అట్లీ కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ సినిమా `AA22` పై ఆసక్తికరమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో బన్నీ పాత్రలపై పలు చర్చలు చక్కర్లు కొడుతున్నాయి.
మొదట్లో బన్నీ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరిగింది. కానీ తాజాగా మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, అల్లు అర్జున్ ఈ సినిమాలో నాలుగు విభిన్న పాత్రలు పోషించనున్నారని సమాచారం. ఈ పాత్రలు – తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా – మూడు తరం వ్యక్తులను ఆవిష్కరించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
అట్లీ చెప్పిన ఈ ప్రత్యేక కాన్సెప్ట్‌కు బన్నీ ఓకే చెప్పినట్లు సమాచారం.. ఈ పాత్రలు ప్రతి ఒక్కదీ తనదైన స్టైల్,
ఎమోషన్స్ తో ఉండేలా సినిమాను రూపొందించబోతున్నట్లు అంటున్నారు. అయితే చిత్ర బృందం నుంచి ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు..
ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యం, పునర్జన్మ కాన్సెప్ట్ విభిన్న కాలప్రమాణాల మధ్య సాగే కథ అనే టాక్ వినిపిస్తోంది. అందుకే చిత్రబృందం ఒక ప్రత్యేకమైన ఫ్యాంటసీ వలె కొత్త ప్రపంచాన్ని డిజైన్ చేయించేందుకు హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ VFX సంస్థతో కలిసి పని చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి…ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. కథ, టెక్నికల్ అంశాలు, గ్రాఫిక్స్, ఇది బన్నీ కెరీర్‌లో మరో మైల్ స్టోన్ గా నిలవనుందని తెలుస్తుంది.. .ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. వీరిలో దీపికా పదుకొణె పేరును ఇప్పటికే చిత్రబృందం అఫిషియల్ గా ప్రకటించింది… మిగిలిన హీరోయిన్ల జాబితాలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, భాగ్యశ్రీ బోర్సే పేర్లు వినిపిస్తున్నాయి..









