Search
Close this search box.

  రాజమౌళి క్రేజీ ప్లాన్..! మహేష్ కు తండ్రిగా మాధవన్..?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ సినిమాపై రోజుకో ఆసక్తికర వార్త వెలుగులోకి వస్తోంది.. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌లో ఆర్. మాధవన్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఆయన మహేశ్ బాబుకు తండ్రిగా కనిపించే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పాత్ర కోసం ముందు నానా పటేకర్, విక్రమ్పేర్లు పరిశీలించినట్టు తెలిసింది..ఒడిశా, హైదరాబాద్‌లలో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత, యూనిట్ ఇప్పుడు కెన్యాలోని అంబోసెలీ నేషనల్ పార్క్ ప్రాంతంలో తాజా షెడ్యూల్ ప్రారంభించింది..

అక్కడ అడవులలో భారీ యాక్షన్, ఛేజింగ్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందిన చిత్రబృందం, రాజమౌళి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్‌కి ఈ షెడ్యూల్ ముఖ్యంగా నిలవనుంది.ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ సినిమా కథ **ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగుతూ,రూపొందించబడినట్లు తెలుస్తోంది..మహేశ్ బాబు ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు.

సినిమాలో డైనోసార్ల వేట, అడవి జీవాల మధ్య సాహసాలు వంటి యూనిక్గా ఉండే అంశాలు కూడా ఉండనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్..ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు..నిర్మాణ వ్యయం దాదాపు రూ.1000 కోట్లు* ఇది భారత చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.. సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.., ఆస్కార్ గెలిచిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ప్రధాన పాత్రల్లో ప్రియాంక చోప్రా,పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖులు నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది..దర్శకుడు రాజమౌళి, ఈ సినిమాను 2027లో గ్లోబల్ లెవెల్‌పై విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది సాధారణ పాన్ ఇండియా చిత్రం కాకుండా, పాన్ వరల్డ్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు