Search
Close this search box.

  రాజాసాబ్ లో తమన్నా ఐటెం సాంగ్..? ఇక థియేటర్లు బ్లాస్ట్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్‌కు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌లు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి..తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది.. తాజా సమాచారం ప్రకారం, సినిమా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తోంది..ఆ పాట కోసం పలువురు స్టార్ హీరోయిన్లను పరిశీలించిన తరువాత, చివరకు తమన్నాను ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీ టాక్..తమన్నా ఇప్పటికే బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్ తో దుమ్ము రేపుతుంది.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మళ్లీ మ్యూజికల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే తమన్నా పలు తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో మెప్పించింది.. గతంలో ప్రభాస్‌తో తమన్నా నటించిన ‘బాహుబలి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.. వీరిద్దరి కాంబినేషన్‌లో మరోసారి ఓ పాట రాబోతుందన్న ఊహాగానాలు అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి..అయితే తమన్నా ఈ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేక ఇంకా చర్చల దశలో ఉందా? అన్నది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.. కానీ ఈ వార్తతో ది రాజాసాబ్ మీద క్రేజ్ మరింత పెరిగింది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు