టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో మళ్ళీ ఒకసారి తన కాంబ్యాక్ ఇచ్చారు.. ఆ సినిమా భారీ విజయం సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో, వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఏంటి.? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వెంకటేష్ తన కొత్త సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నట్లు సమాచారం.. ఇప్పటికే త్రివిక్రమ్ మంచి ఎంటర్టైనర్స్ అందించిన డైరెక్టర్‌గా పేరు పొందారు.. ఆయన పంచ్ డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్ అన్నీ కలిపి ప్యాకేజీలా ఉంటాయి.. ఒక ఆడియన్స్ కూడా వెంకటేష్ నుండి ఇదే కోరుకుంటారు..ఇక ఈ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభమవబోతుండగా, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరా అన్న చర్చ సోషల్ మీడియాలో తెగ జరుగుతుంది.. మొదట్లో త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు న్యూస్ వచ్చింది.. కానీ తాజా బజ్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను తీసుకున్నట్టు టాక్.. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందించిన “హరిహర వీరమల్లు”లో హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇంకా ప్రభాస్ “ది రాజా సాబ్ లో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది.. ఇక ఇటువంటి బడా ప్రాజెక్టుల ఉన్నా, వెంకీ మామ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందాని వార్తలు వస్తున్నాయి.. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు..వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్, అలాగే నిధి అగర్వాల్ జతకట్టే ఛాన్స్ వంటివి ఈ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి.. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైనర్ పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు..









