2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా
అప్పట్లో ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది..
ఆ తర్వాత ఓటీటీలో,టీవీ లో చూసిన యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు.. ఈ సినిమా రీ రిలీజ్ కి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యి కల్ట్ క్లాసిక్ గా మారింది..
తెలుగు యువతను ఆకట్టుకున్న ఓ అద్భుతమైన, స్నేహం, సరదా,, చిన్న చిన్న కష్టాలు – ఇవన్నీ కలిపి, దర్శకుడు తరుణ్ భాస్కర్ అందంగా చెప్పిన ఈ కథ, ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.. సినిమా విడుదలైనప్పటి నుంచి దానికి సీక్వెల్ ఎప్పుడూ వస్తుంది అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో సీక్వెల్ ట్రెండ్నడుస్తుంది.. దాంతో తరుణ్ భాస్కర్ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు.. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఫుల్ జోష్ ఉన్నారు.. అయితే ఈ సీక్వెల్‌కి మరింత ఊపునిస్తూ ఓ హాట్ బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ఓ కామెయో చెబుతున్నట్లు సమాచారం.. ఇది నిజమైతే, ఈ సినిమా కేవలం యువతకే కాకుండా మాస్ ఆడియన్స్ లోనూ భారీ క్రేజీ సంపాదించుకుంది..ప్రముఖ కథనాల ప్రకారం, విశ్వక్ కబాలకృష్ణపై పెద్ద అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే బాలకృష్ణను ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించమని అడిగినట్టు, బాలయ్య కూడా వెంటనే ఓకే చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించి చిత్రబృందం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు..ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆ మజా గ్యాంగ్ మళ్లీ రాబోతుంది! విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను – వీరిద్దరి మధ్య కెమిస్ట్రీనే సినిమా హిట్టయ్యే పెద్ద కారణం. ఇప్పుడు వాళ్లంతా మళ్లీ తిరిగి రావడం అభిమానులకు అదిరిపోయే విషయం.ఇక మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో వివేక్ సాగర్ మరోసారి తన మ్యాజిక్ చేయబోతున్నారు.. బాలకృష్ణ సినిమా చేయబోతున్నారన్న వార్తలు సోషల మీడియాలో తెగ వైరల్ అవుతున్నా, దీనిపై ఇంకస్పష్టత రావాల్సి ఉంది. ఇది నిజమైతే మాత్రం, ‘ఈ నగరానికి ఏమైంది 2’ పైన అంచనాలు మామూలుగా ఉండవని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి..ఇంతవరకూ ఇది గుసగుసల స్థాయిలోనే ఉన్నా, అభిమానుల ఉత్కంఠ మాత్రం రోజురోజుకి పెరుగుతోంది. అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి ఉండాలి..









