మంచు విష్ణు హీరోగా నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది..సినిమా విడుదలైన తర్వాత మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్లతో దూసుకెళ్తోంది.ఈ సినిమా ద్వారా గత కొంతకాలంగా తన నటనపై వస్తున్న విమర్శలకు విష్ణు తగిన సమాధానం ఇచ్చినట్టు అభిమానులు భావిస్తున్నారు..
ఇప్పటికే ‘కన్నప్ప’ విజయంతో మంచి జోష్ లో ఉన్న విష్ణు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు ప్రారంభించాడు.. తాజా సమాచారం ప్రకారం, ఆయన ప్రభుదేవా దర్శకత్వంలో ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘కన్నప్ప’లో కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రభుదేవాతో విష్ణుకు మంచి అనుబంధం ఏర్పడిందని, ఆ సమయంలో చెప్పిన కథ విష్ణును ఆకట్టుకుందని సమాచారం.ఈ సినిమా జానర్ యాక్షన్ మరియు కామెడీతో కూడిన ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతున్నది.. ఈ సినిమా సంబంధించినఅధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.. కన్నప్ప ను నిర్మించిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై ఈ సినిమాను కూడా మంచు విష్ణే నిర్మాతగా నిర్మించబోతున్నట్లు సమాచారం..ప్రభుదేవా – మంచు విష్ణు కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.. ఇప్పటికే ప్రభుదేవా డైరెక్షన్లో వచ్చిన కొన్ని బ్లాక్ బస్టర్ నిలవడంతోఈ సినిమాపై కూడా భారీ అంచనాలు..









