Search
Close this search box.

  త్వరలో సెట్స్ పైకి బిచ్చగాడు 3..?

ఎటువంటి అంచనాలు లేకుండా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల్లో ‘బిచ్చగాడు’ ఒకటి. తమిళంలో విడుదలైనప్పటికీ పెద్దగా అంచనాల్లేకుండా, తెలుగులో అయితే మొదటి రోజు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేని పరిస్థితి.. టైటిల్ చూసి, “బిచ్చగాడు అంటే సినిమా ఏంటి?” అనుకున్నారు…అయితే సినిమా విడుదలైన తర్వాత నుండి పాజిటివ్ టాక్ రావడంతో.. ఒక్కసారి ఆడియన్స్ మెల్లి మెల్లిగా బిచ్చగాడు సినిమా వెళ్లడం మొదలు పెట్టారు.. బిచ్చగాడు స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ తో ఆడియెన్స్ ను మెప్పించింది.. అంతే కాకుండా మదర్ సెటిమెంట్ స్ట్రాంగ్ వర్క్ అవడంతో ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు..దాంతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.. రివ్యూలు, మౌత్ టాక్ కలిసి అద్భుతమైన హైప్ తెచ్చిపెట్టాయి.. ఆ సమయంలో మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ విడుదలవుతున్నా, బిచ్చగాడు’ అందుకు ఓ టఫ్ ఫైట్ ఇచ్చింది. థియేటర్స్‌లో విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఓటీటీలోనూ చక్కటి స్పందనను రాబట్టింది..ఈ సినిమా వల్ల సంగీత దర్శకుడిగా ఉన్న విజయ్ ఆంటోనీ కి హీరోగా స్టార్ ఇమేజ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి… అతను మళ్ళీ బిచ్చగాడు 2’తో వచ్చాడు.. రివ్యూలు మిక్స్‌డ్‌గా ఉన్నా, “బిచ్చగాడు” బ్రాండ్ వలన బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి వసూళ్లు అందుకున్నాడు..ఇప్పుడు విజయ్ ఆంటోనీ తన నెక్స్ట్ ఎంట్రీకి సెట్ అయ్యాడు – ‘బిచ్చగాడు 3’తో! ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాడు.. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని, 2026లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు..ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే – ‘బిచ్చగాడు 1’ను శశి డైరెక్ట్ చేయగా, సీక్వెల్‌కు దర్శకత్వ బాధ్యతలు విజయ్ ఆంటోనీ స్వయంగా చేపట్టాడు. ఇప్పుడు ‘బిచ్చగాడు 3’ కు కూడా ఆయనే దర్శకత్వం వహించనున్నారు. అంతేకాదు, తన సొంత బ్యానర్ ‘విజయ్ ఆంటోనీ ఫిలిమ్స్’లో నిర్మాణ బాధ్యతలు కూడా అందుకోనున్నాడు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు