వేణు శ్రీరామ్ డైరెక్షన్లో నితిన్ హీరోగా రూపొందిన సినిమా తమ్ముడు.. ఈ సినిమా జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ ను శరవేగంగా చేస్తున్నారు.. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసార్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు..ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ దిల్ రాజు పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. ముఖ్యంగా గతంలో అనౌన్స్ చేసిన ‘ఐకాన్’ మూవీ గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు..ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేయాలి..ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను అల్లు అర్జున్ హీరోగా ప్లాన్ చేసినట్టు ప్రకటించగా, ఆ టైమ్‌లో అది హాట్ టాపిక్ అయింది. కానీ ‘పుష్ప’ ఫ్రాంచైజీతో బన్నీ పూర్తిగా బిజీ అయిపోవడంతో, ఐకాన్ మీద ఫోకస్ తగ్గిపోయింది. అప్పటి నుంచి ఈ సినిమా జరగదని టాక్ వినిపించేది..కానీ ఇప్పుడు దిల్ రాజు ఆ ప్రాజెక్ట్ పై మాట్లాడుతూ –
> “ఐకాన్ సినిమా తప్పకుండా ఉంటుందంటూ… బన్నీతో కాకపోయినా, మరో హీరోతో త్వరలో స్టార్ట్ చేస్తాం” అని వెల్లడించారు.
దిల్ రాజు స్టేట్‌మెంట్‌తో ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారింది..ఈ ప్రాజెక్ట్‌కు కొత్త హీరోగా ఎవరిని తీసుకోబోతున్నారు అన్న ప్రశ్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఐతే ఐకాన్ లో నటించబోయే హీరో ఎవరో చూడాలి..!









