Search
Close this search box.

  SSMB29 కోసం భారీ వారణాసి సెట్..! భారీ విజువల్ ట్రీట్ రెడీ..!

పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీగా రూపొందుతున్న రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయి…అధికారికంగా ఈ సినిమాపై ఇప్పటికీ ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ, అభిమానుల్లో ఆసక్తి మాత్రం శరవేగంగా పెరుగుతోంది..తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్డేట్ ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది… ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..

SSMB29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రధాన భాగం వారణాసి బ్యాక్ డ్రాప్ ఆధారంగా తీసుకున్నట్టు సమాచారం.. గంగా నది ఒడ్డున ఉన్న పునీతమైన ఆలయాలు, ఘాట్‌లు వంటి ఆధ్యాత్మికతనిచ్చే వాస్తవిక ప్రాంతాలను చూపించాలంటే అనుమతుల సమస్యలు, లాజిస్టికల్ ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకున్న రాజమౌళి, ఆ సెటప్‌ను హైబ్రిడ్ మోడల్ లో నిర్మించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది…వారణాసి దేవాలయ నిర్మాణాలు, ఘాట్‌ల డిజైన్లు, నదీ తీరపు విజువల్స్ అన్నింటినీ గ్రాండియార్ గా చూపించేందుకు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ల సాయంతో రాజమౌళి టీమ్ ఇప్పటికే స్కెచ్‌లు రెడీ చేస్తోందట… ఈ సెటప్‌ను భారీగా బడ్జెట్ తో క్రియేట్ చేసే పనిలో ఉంది యూనిట్..ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా కె.ఎల్. నారాయణ వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు వరకు వెచ్చించనున్నారని టాక్.. హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుంది.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.. ఇదంతా చూస్తుంటే రాజమౌళి ఈసారి ఫాన్స్ కు భారీ విజువల్ ట్రీట్ రెడీ చేస్తున్నట్లు అనిపిస్తుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు