నాని ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు..
ప్రస్తుతం నాని దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు..
ఈ సినిమా పూర్తిగా రా, రస్టిక్ గా రూపొందుతుంది..ఈ సినిమా లో నాని ఇప్పటి చేయని ఓ కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.. ఐతే ఈ సినిమా తర్వాత నాని సుజిత్ తో సినిమా చేయబోతున్నాడు..
టాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ములతో చేసే సినిమా కూడా ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.. తాజా సమాచారం ప్రకారం, శేఖర్ ఒక సెన్సిబుల్ కథను నానికి వినిపించాడట.. నానికి ఆ కథ నచ్చిందని, ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని టాక్.. అయితే స్క్రిప్ట్ పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది..
వీరిద్దరూ గతంలోనే కలిసి పని చేయాలని అనుకున్నా, వారి బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ కాంబినేషన్ ఇప్పటివరకు కుదరలేదు.. ఈ నేపథ్యంలో తాజాగా ‘కుబేర’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న శేఖర్ కమ్ముల, ఈ వార్తలకు స్పందిస్తూ — నానితో చేసే ప్రాజెక్ట్ పూర్తి స్క్రిప్ట్ పూర్తయ్యాకే అధికారిక ప్రకటన ఇస్తామని స్పష్టం చేశారు..అంతేకాకుండా, ఈ సినిమాను ‘ఏషియన్ సునీల్’ నిర్మించనున్నట్టు సమాచారం. ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ తరహాలో శేఖర్ తన ప్రత్యేక శైలిలో ఈ కథను తెరకెక్కించనున్నాడని టాక్.. అయితే శేఖర్ స్వయంగా ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టైమ్ పడుతుందని చెప్పిన నేపథ్యంలో, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే
అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..ఇటీవలే కుబేర సినిమా థియేటర్లలో విడుదలై విజయవంతంగా నడుస్తుంది..









