Search
Close this search box.

  రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన తమిళ స్టార్ హీరో..?

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ సినిమాల్లో ssmb 29 సినిమా ఒకటి.. దర్శక ధీరుడు ss రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ హైప్ ఉంది.. గ్రాండ్ విజువల్స్‌తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో, హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా పై రోజుకో రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.. అందుకు తగట్టుగానే డైరెక్టర్ రాజమౌళి భారీ కాస్టింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా సంబంధించిన రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి అయినట్లు సమాచారం.. అయితే ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక కీలకమైన విలన్ పాత్ర కోసం రాజమౌళి తమిళ స్టార్ హీరో విక్రమ్ ను తీసుకోబోతున్నట్లు కొన్ని రోజులుగా న్యూస్ వస్తుంది.. ఐతే

నిర్మాతలు తమిళ స్టార్ హీరో విక్రమ్‌ను సంప్రదించారు.. కానీ, ఇది నెగటివ్ షేడ్ పాత్ర కావడంతో విక్రమ్ ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ప్రస్తుతం విక్రమ్ ఈ తరహా పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం..

ఇక మరోవైపు, నటుడు ఆర్. మాధవన్ ఈ సినిమా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ఉన్న మాధవన్, త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కి జాయిన్ అవుతారనే ప్రచారం ఊపందుకుంది.. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు..ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, సినిమా నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక కాస్ట్ అండ్ క్రూ వివరాలు వెలువడలేదు… ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో KL నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు