మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, వరుణ్ తన తదుపరి సినిమాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు…ప్రస్తుతం వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు “కొరియన్ కనకరాజు” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం… హారర్ కామెడీ జానర్‌లో ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ఉండే నేపథ్యంలో, ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత వరుణ్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడు. ఈసారి ఆయనకు కథ వినిపించిన దర్శకుడు విక్రమ్ సిరికొండ… రవితేజ హీరోగా తెరకెక్కిన “టచ్ చేసి చూడు” చిత్రాన్ని తెరకెక్కించిన ఈ దర్శకుడు, ఇప్పుడు వరుణ్‌కి ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ కథను సిద్ధం చేసి వినిపించినట్లు టాక్… విక్రమ్ గత చిత్రం కమర్షియల్‌గా నిరాశపర్చినప్పటికీ, ఈ సారి తాను మంచి కథతో ముందుకు వస్తున్నాడనే నమ్మకంతో ఉన్నారు. వరుణ్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడా లేదా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. అయితే, గతంలో పరాజయం ఎదుర్కొన్న దర్శకుడితో మరోసారి పని చేయడం సాహసమేనని కొందరు ఫ్యాన్స్ భావిస్తున్నారు..









