Search
Close this search box.

  చిట్టిబాబుతో కలిసి మరోసారి చిందు వేయనున్న జిగేల్ రాణి..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈమె ఖాతాలో సరైన హిట్స్ లేకపోయినా, ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. హిందీలో స్టార్ హీరోలతో చేసిన సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేకపోయినా, ఆమెకు మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.. తాజాగా పూజా తమిళ స్టార్ హీరో సూర్యతో చేసిన రెట్రో సినిమాలో కనిపించింది. తమిళంలో యావరేజ్ టాక్ వచ్చినా, తెలుగులో ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది… అయినా పూజకు అవకాశాలు తగ్గడం లేదు..ఇప్పుడు పూజా హెగ్డే మరోసారి టాలీవుడ్‌కి హాట్ టాపిక్ అవుతోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ది సినిమాలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌ కోసం పూజను సంప్రదించినట్లు సమాచారం.. పెద్ది సినిమాలో ఆర్ రెహమాన్ ఐటెం సాంగ్ కోసం ఒక మాస్ బీట్ ను రెడీ చేసినట్లు సమాచారం..ఈ పాట కోసం పూజ రూ. 3 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. పూర్తిస్థాయి పాత్రల్లో నటించే కొందరు హీరోయిన్స్ కూడా ఈ స్థాయిలో పారితోషికం పొందడం లేదు..ఇంతకుముందు రంగస్థలం లో “జిగేలు రాణి” పాటలో రామ్ చరణ్ సరసన పూజ చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనందరికి తెలిసిందే.. ఇప్పుడు మరోసారి ఆ కాంబో రిపీట్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది..పూజా హెగ్డే సినిమాల్లో ఫలితాలు ఎలా ఉన్నా, ఐటెం సాంగ్స్ ద్వారా మాత్రం యూత్ ఆడియెన్స్‌లో తన స్థానం నిలుపుకుంటోంది. రీసెంట్‌గా రజినీకాంత్ నటించిన కూలి సినిమాలోనూ ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు రామ్ చరణ్‌తో కలిసి మరో సాంగ్ చేయబోతుండటం, ఆమె ఫెర్ఫార్మెన్స్ పై మళ్లీ హైప్ ను క్రియేట్ చేస్తోంది.. పెద్ది సినిమా 2026 మార్చి లో విడుదల కాబోతుంది..

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు