సమంత – రాజ్ నిడుమూరు మధ్య ఉన్న సంబంధంపై సోషల్ మీడియాలో చర్చలు.. వైరల్ అవుతున్న పోస్ట్ కారణంగా మళ్లీ హాట్ టాపిక్ గా మారింది..టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత
తాజాగా ‘శుభం’ అనే సినిమాతో మళ్లీ వార్తల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సమంత వ్యవహరించింది.. ఈ సినిమా థియేటర్లో విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది..
రాజ్ నిడుమూరుతో సమంత మల్టిపుల్ టైమ్స్ కనిపించడంతో, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి తాజాగా మళ్లీ గాసిప్‌లు చర్చకు వస్తున్నాయి.. ఇటీవల సమంత, రాజ్‌తో కలిసి ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, గతంలో అంటే ఏప్రిల్ 3న ఆయన భార్య శ్యామలీ డే చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ మళ్లీ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు వారి వ్యక్తిగత జీవితాలపై ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.
శ్యామలీ డే సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసి, బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకులు విశాల్ భరద్వాజ్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా వంటి వారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. ‘రంగ్ దే, బసంతి‘, ఓంకార వంటి సినిమాలకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా కూడా పనిచేసిన ఆమె, 2017లో రాజ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది… రాజ్ నిడుమూరుతో ఉన్న సమంత అనుబంధం పై గతకొన్ని నెలలుగా రూమర్లు ఊపందుకున్నాయి. ఇద్దరూ కలిసి ప్రయాణాలు చేయడం, ఫోటోలు షేర్ చేయడం ఈ ఊహాగానాలకు మళ్లీ బలం చేకూర్చాయి. కానీ ఇంతవరకూ ఇద్దరూ ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అందుకే ఇప్పటికీ ఈ విషయం పై క్లారిటీ లేదు.‘శుభం’ సినిమాతో పాటు, రాజ్ నిడుమూరు టీంతో కలిసి తిరుమలకి వెళ్లిన సమయంలోనూ సమంత పాల్గొనడం గమనార్హం. కానీ ఇది టీం యాక్టివిటీ మాత్రమేనని, ఆ కంటె ఎక్కువగా అర్థం చేసుకోవద్దన్న వాదన కూడా వినిపిస్తోంది.. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన నెటిజన్లు, సోషల్ మీడియాలో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. సమంత నిజంగా రాజ్‌తో డేటింగ్‌లో ఉన్నారా? లేకపోతే, ఇది కేవలం ప్రొఫెషనల్ అనుబంధమా? అనే ప్రశ్నకు ఇంకా అధికారిక సమాధానం రావాల్సి ఉంది…









