Search
Close this search box.

  ఆ బయోపిక్ లో హీరోగా ఎన్టీఆర్..? ఫుల్ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ మరియు పాన్ ఇండియా రేంజ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.. ‘త్రిపుల్ ఆర్’

బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కి గ్లోబ్ లెవెల్లో క్రేజ్ పెరిగిపోయింది.. ఒకవైపు వార్ 2తో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్, మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమాతో మాస్ మోడ్‌లోకి వెళ్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా తారక్ ఓ బయోపిక్ లో కీలక రోల్ చేస్తున్నట్లు న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది.. సినీ పరిశ్రమ పితామహుడిగా పేరుగాంచిన దాదాసాహెబ్ ఫాల్కేజీవిత ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే ప్రాజెక్ట్‌ను రెండేళ్ల క్రితమే ప్రకటించారు.. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి వరుణ్ గుప్తా మరియు ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మించనున్నారని సమాచారం… ఈ సినిమాలో దాదాసాహెబ్ ఫాల్కే పాత్ర కోసం ఎన్టీఆర్ ను అప్రోచ్ అయ్యారనే వార్తలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి.. ఎన్టీఆర్ కూడా ఈ రోల్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది..

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి అఫిషియల్ ప్రకటన రాబోతున్నట్లు సమాచారం..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు