Search
Close this search box.

  రేర్ కాంబో..! రౌడీకి విలన్ గా రాజశేఖర్..?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆయన దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఈ సినిమా టైటిల్ ‘రౌడీ జనార్దన్’ అని దిల్ రాజు ఓ వేదికలో చెప్పారు.. ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్‌తో స్క్రీన్‌పై దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నాడు. ‘రాజావారు రాణీగారు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం సీనియర్ నటుడు రాజశేఖర్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయనపై ఓ లుక్ టెస్ట్ కూడా జరిగినట్టు, చిత్రబృందం రాజశేఖర్ లుక్ పట్ల ఫుల్ హ్యాపీగా ఉందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, రాజశేఖర్ కాంబినేషన్ తెరపై కొత్తగా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది అని ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు… ఇప్పుడు రాజశేఖర్ హీరోగాను కొన్ని సినిమాల్లో , కీలక పాత్రల్లో నటిస్తున్నారు… ఈసారి మాత్రం ‘రౌడీ జనార్దన్’ లాంటి మాస్ ప్రాజెక్ట్‌లో భాగం అయితే, ఆయనకు మరోసారి ఫామ్‌కి రీ ఎంట్రీ దక్కే అవకాశం ఉంది.. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.., ఇది విజయ్ – రష్మిక కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత ఇది ఈ జోడీతో రాబోతున్న మూడో సినిమా కానుంది. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ కాంబోకి భారీ క్రేజ్ చూపిస్తున్నారు.ఈ సినిమా పూర్తి స్థాయి మాస్, యాక్షన్ డ్రామాగా ఉండనుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు