Search
Close this search box.

  స్పిరిట్ లో ప్రభాస్ తో ఆలాంటి సీన్స్..? సందీప్ రెడ్డి వంగా మాస్టర్ స్కెచ్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ కాప్ పాత్రలో కనిపించబోతున్నాడు.. ఈ సినిమా పై ఫ్యాన్స్ లో భారీ హైప్ ఉంది.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందీ.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది..ఐతే ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇటీవల ఇండస్ట్రీలో వినిపిస్తున్న బజ్ ప్రకారం, ఈ సినిమాలో ఇంటర్వెల్ యాక్షన్ సీన్ స్పెషల్ హైలైట్ కానుంది. చైనీస్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సీక్వెన్స్, ప్రభాస్ కెరీర్‌లోనే బెస్ట్ యాక్షన్ మూమెంట్స్‌లో ఒకటిగా నిలవనుందని సమాచారం. ఇది నిజమైతే, అభిమానులకు పండగే అని చెప్పాలి..

సినిమాకు మ్యూజిక్ అందించబోతున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తిచేశారు. తన సంగీత ప్రయాణంలో “విజిల్ సౌండ్ సెంటిమెంట్” కొనసాగిస్తానంటూ హర్షవర్ధన్ చెప్పారు… ప్రస్తుతం సాంగ్స్ కంపోజిషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.భారీ బడ్జెట్ తో టి-సిరీస్ & భద్రకాళి బ్యానర్‌లపై రూపొందుతుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు