తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ’ మంచి విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డు లు క్రియేట్ చేసింది… త్రిష హీరోయిన్ గా, ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి నిర్మించింది… ఇది అజిత్ కెరీర్లో 64వ సినిమా కావడం విశేషం. అజిత్ చేయబోయే 65వ సినిమా డైరెక్టర్ పై సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. గతంలో అజిత్ ఒక ట్రాక్ రికార్డ్ తో పాటు సెంటిమెంట్ కూడా ఉంది.. సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత అదే డైరెక్టర్ లేదా నిర్మాణ సంస్థతో మళ్లీ పని చేయడం అజిత్ కి అలవాటు.. అలా డైరెక్టర్ శివతో నాలుగు సినిమాలు, విష్ణువర్థన్తో రెండు, హెచ్. వినోద్తో రెండు సినిమాలు చేస్తూ ఈ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తున్నాడు… ఈ క్రమంలో, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సక్సెస్ తౌవాత, మళ్లీ ఆధిక్ రవిచంద్రన్తో సినిమా చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది..ఇదిలా ఉంటే, అంతకుముందే నటుడు ధనుష్, అజిత్ ను కలిసి ఓ కథ వినిపించినట్టు సమాచారం. కథ నచ్చడంతో అజిత్ తాను ధనుష్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వినిపిస్తోంది. అయితే ఇది అధికారికంగా ప్రకటించలేదు..తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ, ఓ వార్త వైరల్ అవుతుంది..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ అజిత్తో సినిమా చేయనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పుష్ప సిరీస్తో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న సుకుమార్, త్వరలో అజిత్ కలిసి కథ వినిపించనున్నారని టాక్. ఈ కాంబినేషన్ నిజమైతే, అది నిజంగా వేరే లెవల్ సినిమాగా మారే అవకాశం ఉంది.ఇటీవల కాలంలో కోలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్ డైరెక్టర్లు మరియు నిర్మాణ సంస్థలపై ఆసక్తి చూపుతున్నారు. అజిత్ కూడా అదే బాటలో నడవవచ్చు అని సమాచారం.









