Search
Close this search box.

  ఫ్లాప్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇస్తున్న మెగా హీరో..?

‘జిల్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. డైరెక్టర్ రాధాకృష్ణ ఆ తరువాత ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో ‘రాధేశ్యామ్’ సినిమా తీశాడు.. కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.. ఇక అప్పటి నుండి డైరెక్టర్ రాధాకృష్ణ నుండి ఇప్పటి వరకు ఏ సినిమాను ప్రకటించ లేదు.. ఐతే డైరెక్టర్ రాధాకృష్ణ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘రాధేశ్యామ్’ తర్వాత ఆయన నుంచి కొత్త సినిమా రాలేదు. మొదటగా గోపీచంద్‌తో సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి కానీ, గోపీచంద్ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది.

తాజాగా రాధాకృష్ణ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు ఓ లవ్ స్టోరీ కథ వినిపించారట. ఇది ఒక క్లాసికల్ లవ్ స్టోరీ అని సమాచారం. వరుణ్‌కి కథ నచ్చడంతో ప్రాజెక్ట్ దాదాపుగా ఓకే అయినట్టు టాక్. అయితే ఈ సినిమాకి సంబంధించిన బ్యానర్, షూటింగ్ వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నాయి.

ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ జరగుతోంది. ఆచార్య సినిమా సెట్లో ఓ ఐటెమ్ సాంగ్ కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాతే రాధాకృష్ణ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో వరుణ్ తేజ్ ఎక్కువగా యాక్షన్ జానర్‌లో సినిమాలు చేశారు. అందుకే ఈసారి ఒక మంచి లవ్ స్టోరీ చేయాలనుకున్నారట. రాధేశ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా, అందులో ఉన్న రొమాంటిక్ మూమెంట్స్, విజువల్స్ ప్రశంసలు పొందాయి. బహుశా అదే నమ్మకంతో వరుణ్ తేజ్ ఈ కథకు ఓకే చెప్పినట్టుగా చెబుతున్నారు. చూడాలి మరి ఈసారి ఎలాంటి లవ్ స్టోరీతో సినిమా వస్తుందో..?

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు