మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు..వరుసగా సినిమాలు చేస్తూ , ఫుల్ బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరం సినిమాతో బిజీగా ఉన్నారు… ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది..–ఆ తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేసేందుకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ప్రస్తుతం ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.. ఐతే ఈ గ్యాప్ లో మెగాస్టార్ మరో డైరెక్టర్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతోంది.. చిరంజీవి రీ ఎంట్రీ తరువాత చేసిన సినిమాలలో ‘వాల్తేరు వీరయ్య’ స్పెషల్. దర్శకుడు బాబీ మెగాస్టార్‌ని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా తెరకెక్కించి, సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ని అందించారు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ వల్ల మరోసారి చిరు–బాబీ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రానుందని సమాచారం.. ఈ సినిమాకు సంబంధిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయినట్లు సమాచారం .. మెగాస్టార్ బర్త్ డే రోజున ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా కూడా ఫుల్ ఔట్ అండ్ ఔట్ మాస్ స్టార్టీతో రాబోతున్నట్లు తెలుస్తుంది.. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి…ఇక మరో ప్రాజెక్ట్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనుంది. ఈ సినిమా కూడా సంక్రాంతి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం… ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి..









