మహాభారతం ప్రాజెక్ట్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ సినిమా కోసం యావత్ ఇండియన్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. రాజమౌళి డైరెక్షన్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే పైగా ఈ సినిమా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా మొదలు కాకముందే పలు ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఐతే ఈ మహాభారతం ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ లో కూడా భారీగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఈ ప్రాజెక్ట్ కోసం అమీర్ ఖాన్ కూడా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.. ఐతే మహాభారతం ప్రాజెక్ట్ లో మరో హీరో ను కన్ఫర్మ్ చేశాడు రాజమౌళి.. రీసెంట్ జరిగిన హిట్ 3 ఈవెంట్లో రాజమౌళి ఈ విషయాన్ని చెప్పాడు.. ఇప్పటికే రాజమౌళి ముగ్గురు స్టార్ హీరోలను ఈ ప్రాజెక్ట్ లో ఫిక్స్ చేశాడు.. అందులో మొదటగా ప్రభాస్ ను బాహుబలి ప్రమోషన్ టైమ్ లో ఫిక్స్ చేయగా.. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ను మహాభారతం లో కీలక పాత్రలకు ఫిక్స్ చేసినట్లు తెలిపాడు.. రామ్ చరణ్,ఎన్టీఆర్ మహాభారతంలో ఉంటారు అని చెప్పాడు.. ఇప్పుడు నాని కూడా ఫిక్స్ చేశాడు.. కానీ ఇప్పటి వరకు ఎవరు ఏ పాత్ర చేస్తున్నారో మాత్రం రీవీల్ చేయలేదు.. చూడాలి మరి రాజమౌళి తెరకెక్కించే మహాభారతం ఏ రేంజ్ లో ఉంటుందో..









