సూపర్ స్టార్ మహేష్ బాబు– దర్శకధీరుడు ss.రాజమౌళి కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ సినిమాపై క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది.RRR తర్వాత వస్తున్న రాజమౌళి నుండి వస్తున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో పాటు, మహేష్ బాబుకు కెరీర్ లోనే కొత్త జానర్ కూడా.. ఈ సినిమాను ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నట్లు రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇది వరకే క్లారిటీ ఇచ్చారు.. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేదు.. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి ఓ చిన్న షూటింగ్ క్లిప్ లీక్ అయ్యి సోషల్ మీడియాను షేక్ చేసింది.. శ్రీదుర్గా ఆర్ట్స్‌పై K.L. నారాయణ ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నరు.. ఈ మూవీ లో భారీ స్టార్ కాస్ట్ ఉండబోతున్నట్లు సమచారం.. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్లు కూడా ఉన్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాకి ‘SSMB29’అనే వర్కింగ్ టైటిల్ ఉంది.. తాజా బజ్ ప్రకారం – ఈ సినిమాని 2027 మార్చి 25న విడుదల చేయాలన్నది రాజమౌళి ప్లాన్. అదే డేట్‌కి ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ డేట్స్ అన్నీ రాజమౌళి సెటిమెంట్ గా నమ్ముతున్నట్లు తెలుస్తుంది..









