Search
Close this search box.

  #NTR30 సెట్స్ లోకి డ్రాగన్ ఎంట్రీ..! భారీ ఎలివేషన్ తో ఇంట్రో..!

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా గురించి సోషల్ మీడియాలో రోజుకో రూమర్ వైరల్ అవుతోంది. అయితే తాజా రూమర్ ప్రకారం ఈ నెల 22 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతోంది… ఇందులో ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఎంట్రీ సీన్‌లను షూట్ చేయనున్నారట…ఐతే ఈ ఇంట్రో ను భారీ ఎలివేషన్ తో ప్రశాంత్ నీల్ పక్కగా ప్లాన్ చేశారట.. ఈ ఇంట్రో ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో లేని విధంగా భారీ రేంజిలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.. ఐతే సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ ఓ ఫైట్ సీన్ అని సమాచారం.. దాదాపు 100 మంది తో ఫైటర్స్ ఈ సీన్ లో ఉండబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్లో సమాచారం.. ఐతే ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పక్కాగా ఫిక్స్ అవుతుందన్న టాక్ జోరుగా నడుస్తోంది. ఈ టైటిల్‌తోనే ఈ సినిమా రేంజ్ ఏంటో అందరికి అర్థమయ్యేలా ఉంటుందని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట..“ఎన్టీఆర్‌కి ఫ్యాన్‌గా చేస్తున్నాను. ఇది ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఉంటుంది” అని ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో, ఈ సినిమా అంచనాలు మరింత పెంచేస్తోంది.అంతేకాదు, ఈ సినిమా స్క్రిప్ట్‌ను రూపొందించేందుకు ప్రశాంత్ చాలా టైమ్ తీసుకున్నాడట… ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి… సంగీతం అందిస్తున్నది కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ కావడంతో, మ్యూజిక్ కూడా మాస్ రేంజ్‌లో ఉండబోతోందని గ్యారంటీ..! చూడాలి మరి ఈ డ్రాగన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు