టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ హీరోయన్ మీనా.. ఒకప్పుడు స్టార్స్ అందరి సరసన కనిపించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోను ఫుల్ బిజీగా ఉంది.కానీ, ఈ మధ్య మీనాపై పర్సనల్ లైఫ్ రూమర్లు మాత్రం ఆగట్లేదు.. మొన్న “రెండో పెళ్లి చేసుకోబోతోంది” అని, ఇప్పుడు “ధనుష్‌తో పెళ్లి చేసుకుంటోంది” అని వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి…మీనా భర్త డాక్టర్ విద్యాసాగర్ ఇటీవలే కన్నుమూశారు…ఆ సమయంలో ఆమె ఎంత విషాదంలో మునిగిపోయిందో అందరికీ తెలుసు…అలాంటి టైమ్‌లో ఈ తరహా రూమర్స్ వస్తున్నాయి.. దీని పై మీనా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించింది, “ఇలాంటివి వదంతులే. నా జీవితంలో రెండో పెళ్లి లేదు. నాకు ఒక కూతురు ఉంది, ఆమె భవిష్యత్తే నా లక్ష్యం” అని తేల్చిచెప్పింది.
అంతేకాదు, “ఎవరి తో క్లోజ్‌గా మాట్లాడినా, వాళ్లతోనే పెళ్లి చేసుకుంటున్నానా?” అంటూ గట్టిగా ప్రశ్నించింది. సోషల్ మీడియాలో ఈ రూమర్స్ వల్ల తాను ఎంతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయాననీ, ఇకపై ఇలాంటి విషయాలు ఎవరూ స్ప్రెడ్ చేయవద్దని స్పష్టం చేసింది.
మీనా సినిమాలే ఫోకస్ చేస్తున్నట్లు చెప్పింది..ప్రస్తుతం మీనా తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టింది…









