నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ బ్యానర్ పై నిర్మాతగా వ్యవహరించిన హిట్: ది ఫస్ట్ కేస్”హిట్ 2: ది సెకండ్ కేస్’ సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర భారీ హిట్లు గా నిలిచాయి.. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్రాంచైజీలో, ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్, ఆ తర్వాత సెకండ్ పార్ట్ లో అడివి శేష్ హీరోలుగా నటించారు. ఇప్పుడు, ఈ హిట్ సిరీస్‌ను నుండి మరో పార్ట్ రాబోతుంది.. హిట్ 3 పేరుతో రాబోతున్న ఈ సినిమాను నాని స్వయంగా హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్నాడు.. కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘హిట్ 3’ టీజర్ అందరినీ ఆకట్టుకుంది.. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా, నానిని నేచురల్ స్టార్ నుంచి మోస్ట్ వైలెంట్ స్టార్‌గా మార్చింది..ఐతే ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అదేంటంటే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం..! హీరో కార్తీకి తమిళనాట కాకుండా, తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది..ఇప్పుడు, ‘హిట్ 3’లో కూడా ఆయన స్పెషల్ రోల్ పోషించనున్నారని, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తోంది… ఇది కనుక నిజమైతే ఫాన్స్ కు పండగే అని చెప్పాలి.. అంతే కాదు హిట్4 కూడా ఉండబోతుందని అందులో కార్తీ నే హీరో అని సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది..భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘హిట్ 3’ ప్రపంచవ్యాప్తంగా మే 9న విడుదల కానుంది…









