మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా గురించి అభిమానుల్లో అప్పుడే ఉత్కంఠను మొదలైంది… ఈ సినిమా నుండి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. మొత్తం ఐదు పాటలు ఉండనున్నాయని సమాచారం.. ఇప్పటికే మూడు పాటల ట్యూన్స్ సిద్ధమవ్వగా మిగిలిన రెండు పాటల పనులు కొనసాగుతున్నాయట..సినిమాకు సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో పని చేస్తున్నారు.. ‘ధమాకా’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి హిట్ ఆల్బమ్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.. భీమ్స్, ఇప్పుడు చిరంజీవి సినిమాకి తనదైన స్టైల్ మ్యూజికల్ తో రెడీ అవుతున్నట్లు సమాచారం…అయితే ఈసారి అనిల్ రావిపూడి మరోసారి తన సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నట్లు సమాచారం.. అనిల్ గత సినిమా సంక్రాంతి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ తో ఓ పాట పాడించాడు.. అలాగే ఈసారి మెగాస్టార్ చిరంజీవి తో కూడా ఓ పాట పాడించబోతున్నట్లు సమాచారం.. ఇందుకు చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం..
గతంలో కూడా మెగాస్టార్ పలు పాటలు పాడి అభిమానులకు మ్యూజికల్ ట్రీట్ ఇచ్చారు. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు స్వరాన్ని వినిపించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమా మ్యూజికల్ ఎక్స్పీరియెన్స్ మెగా అభిమానులకు మరో అద్భుతమైన అనుభూతినిచ్చేలా ఉంటుందని సమాచారం..ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..









