ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్ వస్తున్నాయి.. ఇప్పుడు బాలీవుడ్ లో వచ్చిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాకి కూడా సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం..హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘క్రిష్’ సిరీస్ అభిమానులకు ఎంతో ఆకట్టుకుంటుంది… ఈ సిరీస్ మూడు పార్ట్ లు ఇప్పటికే విడుదలై భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి… ఇప్పుడు నాలుగో పార్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
ఇప్పుడు క్రిష్ 4 సంబంధించి , హృతిక్ తండ్రి, ప్రముఖ దర్శకుడు రాకేశ్ రోషన్ ‘క్రిష్ 4’ గురించి అప్‌డేట్‌ను పంచుకున్నారు… , ఈ సినిమాకు హృతిక్ రోషన్ స్వయంగా దర్శకత్వం వహించనున్నారు అని ఆయన చెప్పారు… దీనితో, ‘క్రిష్ 4’ కి సంబంధించి గతంలో వచ్చిన ప్రచారాలు, అధికారిక ప్రకటనే అందరికీ క్లారిటీ వచ్చింది…ఐతే ఈసారి , ‘క్రిష్ 4’ను హాలీవుడ్ స్థాయిలో రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. చూడాలి మరి క్రిష్ 4 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చూస్తుందో చూడాలి..









