విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇండస్ట్రీలో సతమతమవుతున్నడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డామ్ అనే సినిమా చేస్తున్నాడు..ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ దిల్ రాజు ప్రొడక్షన్లో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.. ఈ సినిమాకి ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్‌తో తెరకెక్కనుంది, ఇది యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ కు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు… ఐతే ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సమాచారం.. ఆ హీరోయిన్ మరెవరో కాదు కీర్తి సురేష్.. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫిక్స్ అయినట్లు సమాచారం.. గతంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ ఓ కామీయో రోల్ చేశాడు..ఇప్పుడు వీళ్లిద్దరూ కలసి ఫుల్ గా నటించబోతున్నారు.. చూడాలి మరి వీళ్ళ జోడీ వెండి తెరపై ఎలా మెప్పిస్తుందో..విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్‌లో రౌడీ జనార్ధన ఈ సినిమా పై ప్రేక్షకులో భారీ అంచనాలు ఉన్నాయి..









