Search
Close this search box.

  2026 లో మైత్రి మేకర్స్ నుండి భారీ పాన్ ఇండియా సినిమాలు..!

మైత్రీ మూవీ మేకర్స్ 2026 సంవత్సరాన్ని తెలుగు సినిమా పరిశ్రమలో గేమ్ ఛేంజింగ్ ఏడాదిగా మార్చేందుకు సిద్ధమవుతోంది.. ఈ బ్యానర్ రూపొందిస్తున్న సినిమాల లైనప్ చూస్తే 2026 సంవత్సరం మొత్తం మైత్రి సంస్థదే అన్నట్లే ఉంది.. మైత్రి మూవీ మేకర్స్ నుండి 2026 సంవత్సరంలో భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి.. పాన్-ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతుంది ఈ సంస్థ.. మైత్రి నుండి వస్తున్న సినిమాల లైనప్

 

*#NTRNeel – జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ థ్రిల్లర్, ‘డ్రాగన్’ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

 

* #RC16 – రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం కూడా పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది, మరియు చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

 

*#PrabhasHanu– ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ అనే పీరియాడ్ వార్ డ్రామా.. ఈ సినిమా కూడా 2026లో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి విడుదల అవుతుంది.

 

*#UstaadBhagatSingh – పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాస్ ఎంటర్‌టైనర్. 2026లో విడుదల కానుంది.

 

*. #JaiHanuman – 2024లో ఘన విజయం సాధించిన ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ 2026లో విడుదల కానుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, రిషబ్ శెట్టి హీరోగా ఈ సినిమా రాబోతుంది..

 

*#VD14 – విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘VD14’ చిత్రం 2026లో విడుదల కానుంది..

 

ఈ సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ నుండి వచ్చే విడుదల కానున్నాయి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు