అక్కినేని అఖిల్ తన కెరీర్ లో సక్సెస్ సాధించడానికి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం కొత్త సినిమాలతో మరియు ప్రాజెక్టులతో సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.. ఇప్పటికే ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ మూడు సినిమాలకు కమిట్ అయినట్లు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అఖిల్ కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లను కమిట్ చేశాడు. ఈ మూడు సినిమాలు అఖిల్ యొక్క కెరీర్ లో ఓ కీలక మలుపుగా మరోబోతున్నట్లు సమాచారం..
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త సినిమా
-అనిల్ అనే నూతన డైరెక్టర్ ఈ సినిమాను రూపొందిస్తుండగా, ఈ చిత్రం వంద కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతోంది..
‘లెనిన్’ (వినరో భాగ్యము విష్ణుకథ డైరెక్టర్) – మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
‘సామజవరగమన’ మాటల రచయిత నందు సవిరిగాన దర్శకత్వంలో మరో చిత్రం – ఈ సినిమా ఎంటర్టైనర్ గా రూపొందించబోతున్నారు, శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నాడు..మరి ఈ మూడు ప్రాజెక్ట్‌లు అఖిల్ కెరియర్ ను ఎలా మలుపు తిప్పుతాయో చూడాలి..









