టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతూన్నాడు.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన గత రెండూ సినిమాలు లైగర్, డబల్ ఇస్మార్ట్ లు బాక్స్ ఆఫీసు దగ్గర భారీ ఫ్లాప్స్ గా నిలిచాయి.. ఒకప్పటి పూరీ జగన్నాథ్ మార్క్ దర్శకత్వం, & కథ లేకపోవడంతో ఈ సినిమాలు భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి.. దాంతో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఏ హీరో ధైర్యం చేయడం లేదు.. కానీ పూరీ జగన్నాథ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి హిట్ టాక్ ఎక్కాలని చూస్తున్నారు.. రీసెంట్ గా కింగ్ నాగార్జున తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
పూరీ, ఛార్మి విడిపోయారా..?
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన గత సినిమాలన్నీ ఒక్కప్పటి హీరోయిన్ చార్మి నిర్మిస్తుంది.. పూరీ ,ఛార్మి కలసి సినిమాలు చేస్తున్నారు.. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఛార్మి ప్రొడ్యూసార్ గా సినిమాలు తీశారు… అంతేకాదు
వీళ్లిద్దరి మధ్య ఏదో సంబధం ఉందని అప్పట్లో రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.. వీళ్లిద్దరూ కూడా కలిసి తిరగడంతో ఈ న్యూస్ అందరూ నిజమే అని అన్నారు..పలు వేదికల పై వీళ్లిద్దరూ మేము ఫ్రెండ్స్ అని చెప్పారు.. ఛార్మి సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. చాలా ఏళ్లుగా పూరీ జగన్నాథ్ తో ట్రావెల్ అవుతూ వస్తుంది.. కానీ ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోయారంటూ.. ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దీనికి కారణం పూరీ తీసిన సినిమాల వల్ల ఛార్మి నష్ట పోయిందాని.. చాలా డబ్బులు పోవడంతో పూరీ , ఛార్మి మధ్య గొడవ జరిగిందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..









