Search
Close this search box.

  క్రేజీ కాంబో : హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో గోపీచంద్ సినిమా..!

యాక్షన్ హీరో గోపీచంద్ వరుస అపజయలతో కెరియర్ ను సాగిస్తున్నాడు.. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన విశ్వం సినిమా బాక్స్ ఆఫీసు వద్ద హిట్ గా నిలిచి. అటు హీరోగా గోపీచంద్ కెరియర్ కి ఇటు డైరెకర్ శ్రీను వైట్ల కి కమ్ బ్యాక్ ఇచ్చింది..ఈ సినిమాతో గోపీచంద్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు.. ఇప్పుడు తాను చేయబోయే సినిమాల స్క్రిప్ట్ సెలక్షన్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.. విశ్వం తరువాత ఇంత వరకు గోపీచంద్ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడో ప్రకటించలేదు.. విశ్వం ఇచ్చిన కమ్ బ్యాక్ అలాగే ఉంచుకొని స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసినట్లు సమాచారం..సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో రానా దగ్గుబాటి హీరోగా వచ్చిన ఘాజీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఆ తరువాత వరుణ్ తేజ్ తో అంతరిక్షం సినిమా చేశాడు.. ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర అంత ఆశించిన ఫలితం లభించలేదు.. ఆ తరువాత చాలా గ్యాప్ తర్వాత గోపీచంద్ హీరోగా ఇప్పుడు ఈ డైరెక్టర్ ఓ సినిమా చేయబోతున్నాడు.. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు