నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా “తండేల్”..ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్ ను నుండి రూపొందిన సినిమా ఇది.. శ్రీకాకుళం నుండి చేపల వేటకు గుజరాత్ వెళ్ళే కొందరు.. ఒక రోజు అనుకోకుండా పాకిస్థాన్ బార్డర్ కు పోతారు.. పాకిస్తాన్ వాళ్లకు దొరికిన తర్వాత తిరిగి ఎలా పాకిస్థాన్ నుండి ఇండియాకు ఎలా చేరుకున్నారు అనే కథాంశంతో రూపొందిన ఈ సినిమా.. ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాదు చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది.. చైతూ, సాయి పల్లవి నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.. ఏకంగా ఈ సినిమా 100కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు.. ఐతే ఈ సినిమా త్వరలో ఓటిటిలోకి రాబోతున్నట్టు నిర్మాణ సంస్థ వెల్లడించింది.. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ ధరకు దక్కించుకుంది.. ఐతే ఈ సినిమా మార్చి 7న ఓటిటిలోకి రాబోతుంది.. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు..









