తిరుపతి అలిపిరి నుండి కాలినడకన తిరువేంకటగిరికి దారి చూపిన గోవిందుని పాదాలు బ్రహ్మ కడిగిన పరమపద పాదాలని తిరుమల పాదయాత్ర గురుస్వామి దూసర్ల పూడి రమణరాజు అన్నారు. . పాదయాత్ర పూర్తి చేసి చేపట్టిన 108 వారాల జపయజ్ఞ పారాయణ సందర్భంగా., కాకినాడ సూర్యారావు పేట దూసర్లపూడి వీధిలో ఉన్న భోగి గణపతి పీఠంలో 74వ వ్రత ఆరాధనగా, శివకేశవులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. శివపూజ బియ్యాన్ని పంపిణీ చేసారు. ఉగాది రోజున 1008 శ్రీవారి పాదాల ఫొటోలను భక్తులకు అందిస్తామన్నారు.
