కాకినాడ జిల్లా పిఠాపురంలో దివ్య క్షేత్రమైన పాదగయలో శ్రీ రాజరాజేశ్వరిసమేత ఉమాకుక్కుటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈనెల 24 నుండి శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామిఅమ్మవార్లను పెండ్లికొడుకు,కుమార్తెలుగా అలంకరించారు. అనంతరం రాత్రి వివాహం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వివాహాన్ని తిలకించారు. ద్విభాష్యం సుబ్రహ్మాణ్యంశర్మ ఘనాపాటి, చెరుకుపల్లి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కళ్యాణం జరిపించారు. ఆలయ ఈవో, చిఫ్ ఫెస్టివల్ అధికారి ప్రసాదరావులు స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.
