పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో ఈనెల 24వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మహాశివరాత్రి ఉత్సవ ప్రత్యేక అధికారి టి. సూర్యనారాయణ ఆలయ ఈవో నీలకంఠంలు చెప్పారు. ఈ ఏడాది ఎవరికి ఎలాంటి పాస్ లు జారీ చేయడం లేదన్నారు.
