ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక సజావుగా స్వేచ్ఛా యుత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీల సహకరించాలని ఎమ్మెల్సీ ఎన్నికల ఏఆర్వో జె.వెంకటరావు అన్నారు.కలెక్టరేట్ లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధిం చి జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లు,శిక్షణ కార్యక్రమాలు,ఎన్నికల కోడ్ అమలు, పోలింగ్ కేంద్రాల వివరాలు,పోలింగ్ తేదీ,సమయం,ఓటు వేసే అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,మొత్తం ఓటర్ల వివరాలు వంటి అంశాలను రాజకీయ పార్టీ ప్రతినిధులకు డీఆర్వో వివరించారు.









