కాకినాడ జిల్లా జగ్గంపేట లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో శివ కేశవ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఏలేరు ప్రధాన కాలువ ఒడ్డున ఇర్రిపాక గ్రామం ఈ మహోత్తర కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వేదపండితులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
