ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రముఖ సినీ నటుడు రాజేందప్రసాద్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పలు విషయాలపై చర్చించుకునున్నట్లు సమాచారం.పవన్ కళ్యాణ్ ను ఆయన సన్మానించారు.రాజేంద్రప్రసాద్ ను పవన్ కళ్యాణ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.









